
130 కోట్ల భారత ప్రజల గౌరవాన్ని నిలబెట్టాడు అని చెప్పాలి. టోక్యో ఒలింపిక్స్ లో భాగంగా జావలిన్ త్రో విభాగంలో మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. దీంతో భారత చిరకాల కలగా ఉన్న స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రా ఒక్కసారిగా సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఒలంపిక్స్ తర్వాత జరిగిన టోర్నీ లలో కూడా అదరగొడుతున్నాడు. గోల్డ్మెడల్ సాధిస్తూ వస్తున్నాడు ఈ ఆటగాడు. ఇక ప్రతీ టోర్నీలో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటున్నాడు అని చెప్పాలి.
ఈ క్రమంలో ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గోల్డ్ మేడలిస్ట్ నీరజ్ చోప్రా. జావలిన్ త్రో లో ఈ ఏడాది తప్పనిసరిగా 90 మీటర్ల దూరాన్ని అందుకుంటాను అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. డైమండ్ లీగ్లో భాగంగా మొదటి త్రో తర్వాత 90 మీటర్ల దూరాన్ని అనుకుంటాను అని భావించా.. కానీ అది కుదరలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఈ ఏడాది మాత్రం తప్పకుండా 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రపంచ చాంపియన్షిప్ లో భారత్కు ఇప్పటివరకు ఒక్క పథకం మాత్రమే లభించింది అంటూ చెప్పుకొచ్చినా నీరజ్ చోప్రా ఇక ఈ విషయంలో తనపై ఒత్తిడి ఉంటుందని అయినప్పటికీ ఒత్తిడిని జయించి రాణించడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు..