ఇక అభిమానులు ఎదురు చూసి చూసి ఇక సెంచరీ ఆశలు కూడా సన్నగిల్లుతుంది అని చెప్పాలి. ఇలా తన కెరీర్లోనే ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ.. ఇక రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు కోల్పోయే అవకాశం కూడా ఉంది అంటూ టాక్ వినిపిస్తోంది అనే విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే అటు విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విరాట్ కోహ్లీకి కొన్నాళ్లపాటు విశ్రాంతి ఇస్తే బాగుంటుంది అంటూ చెబుతూ ఉంటే.. మరి కొంత మంది విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్థానాన్ని మార్చడం ద్వారా మంచి ఫలితం రాబట్టవచ్చు అంటూ చెబుతున్నారు.
ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఇంగ్లాండ్తో నేడు జరగబోయే రెండో టి20 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రిత్ బూమ్రా, జడేజా జట్టుతో చేరబోతున్నారూ. అయితే ఈ రెండో టి 20 మ్యాచ్ లో రోహిత్ శర్మ కు జోడీగా విరాట్ కోహ్లీ ఓపెనింగ్ లో బ్యాటింగ్కు దింపితే బాగుంటుందని స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ కోహ్లీ మంచి భాగస్వామ్యం అందిస్తే ఆ తర్వాత దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఎంతో దూకుడుగా పరుగులు చేసే అవకాశం ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు. కాగా మొదటి టీ-20లో దూరమై ఇక ఇప్పుడు రెండో టీ20లో జట్టులో చేరిన విరాట్ కోహ్లీనీ ఏ స్థానంలో బరిలోకి దింపుతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి.