ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా అక్కడ టెస్ట్ మ్యాచ్ తో పాటు టి20 వన్డే సిరీస్ ఆడుతుంది.  టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోగా.. టి 20 సిరీస్ లో మాత్రం  ఇటీవలే టీమిండియా అదరగొట్టింది. టెస్ట్ మ్యాచ్లో ఓటమి నిరాశ పరిచినప్పటికీ టి20 సిరీస్ లో మాత్రం వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి  ఒక మంచి మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుని టీమిండియా సత్తా చాటింది అని చెప్పాలి. ఇక క్లీన్స్వీప్ చేస్తుందని అనుకున్నప్పటికీ అది కుదరలేదు. అయితే ఇక ఇప్పుడు టి20 సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో వన్డే సిరీస్కు కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది టీమిండియా.


 ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి ఫామ్ లేమితో ఇబ్బంది పడుతోన్న విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ లో ఆడతాడా  లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో టీమిండియా ఆడబోయే వన్డే సిరీస్కు ముందు ఊహించని షాక్ తగిలింది అని తెలుస్తుంది. నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే మొదటి వన్డే మ్యాచ్ కు విరాట్ కోహ్లీ దూరమయ్యారు అనేది తెలుస్తుంది. అయితే గజ్జల్లో గాయం కారణంగా విరాట్ కోహ్లీ అటు వన్డే మ్యాచ్ లో ఆడటం లేదు అని బిసిసీఐ వర్గాల నుంచి సమాచారం.


 ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ అటు ప్రాక్టీస్ సెషన్ కూడా హాజరుకాలేదు అనేది తెలుస్తుంది. ఈ విషయంపై అటు బిసిసిఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సివుంది. అయితే విరాట్ కోహ్లీ జట్టుకు దూరమయ్యాడు అని తెలియడంతో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. నేడు ఇక మొదటి వన్డే మ్యాచ్ జరగబోతోంది. కాగా 14వ తేదీన రెండో వన్డే మ్యాచ్ 17వ తేదీన మూడో వన్డే మ్యాచ్ జరగబోతున్నాయి. మొదటి వన్డే మ్యాచ్ కి దూరమైన కోహ్లీ ఇక తర్వాత రెండు వన్డే మ్యాచ్ లకు మాత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: