ఓ బాక్సింగ్ పోటీలు సందర్భంగా నెలకొన్న తీవ్ర విషాదకర ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కోమాలోకి వెళ్లిన 23 ఏళ్ల కిక్ బాక్సర్ నిఖిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఈ నెల 10వ తేదీన కెంగేరి కి చెందిన కిక్ బాక్సింగ్ సంఘం నగరంలోని విజ్ఞాన భారతి ప్రాంతంలోని ఓ జిమ్లో కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించింది. కిక్ బాక్సింగ్ లో శిక్షణ పొందుతున్న నిఖిల్ పోటీలలో పాల్గొన్నాడు. అయితే బౌట్ లో తీవ్రంగా గాయపడి రింగ్ లోనే కుప్పకూలిపోయాడు.
అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా రెండు రోజులపాటు కోమాలో ఉండి ఇక చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే అతని తండ్రి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిక్ బాక్సింగ్ సంఘం, దాని ప్రధాన కోచ్ నవీన్ రవిశంకర్ పై జ్ఞాన భారతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాక్సింగ్ పోటీల నిర్వాహకులు నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చనిపోయాడు అని నిఖిల్ తండ్రి సురేష్ ఆరోపిస్తున్నాడు. బాక్సింగ్ రింగ్ లో ఏర్పాటుచేసిన మ్యాట్ మందం చాలా తక్కువగా ఉందని ఈ క్రమంలోనే తమ కొడుకు కింద పడటంతో తలకు గాయం అయ్యి ఇక ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి.