
ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు ఇలా పెళ్లి కాకుండానే పిల్లలను కంటున్న ఘటనలు ఇటీవల కాలం లో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇండియన్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సైతం ఇలా పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది క్రీడాకారులు పెళ్లి కాకుండానే తండ్రి అయిన వారు ఉన్నారు అని చెప్పాలి. కానీ మొదటి సారి ఒక మహిళ క్రీడాకారిణి పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి టెన్నిస్ స్టార్ మరియా షరపోవా తనకు కాబోయే భర్త అలెగ్జాండర్ గ్రిల్స్క్ తో కలిసి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని తన అభిమానులతో ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది ఈ రష్యన్ టెన్నిస్ క్రీడాకారిణి ఇక వీరికి పుట్టిన బాబుకు థియేడర్ అని పేరు పెట్టినట్లు చెప్పింది. షరపోవా గ్రిల్స్క్ 2020 డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది టెన్నిస్ కి వీడ్కోలు కూడా పలికింది శరపోవ. అప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కానీ ఇప్పుడు వరకు వీరి పెళ్లి మాత్రం జరగలేదు. కానీ అప్పటి నుంచి వీరు సహజీవనం చేస్తూనే వస్తున్నారు. అయితే ఇలా పెళ్లి కాకుండానే ఏకంగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది స్టార్ టెన్నిస్ ప్లేయర్ మరియా షరపోవా. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి