గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లీ అయితే ఇప్పుడు సెంటర్ చేయలేకపోతున్నాడని అందరూ విమర్శలు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ 20019 లో తన 70 వ సెంచరీ చేశాడు. కానీ ఇప్పుడు వరకు మరో సెంచరీ ఊసే లేదు అన్న విషయం తెలిసిందే. దీంతో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి మూడు ఏళ్లు గడిచిపోతున్నాయి.. కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ వస్తుందని అభిమానులు ఎదురు చూడటం చివరకు నిరాశ పడటమే జరుగుతుంది. దీంతో కోహ్లీ సెంచరీ చేయలేకపోతున్నాడు అంటూ ఎంతో మంది రాద్ధాంతం చేస్తున్నారు.


 కానీ టీమ్ ఇండియా లో ఉన్న మరో ముగ్గురు స్టార్ బ్యాట్స్ మెన్ లు కూడా సరి చేయక చాలా రోజులు అవుతుంది అన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది   రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్లో సెంచరీ లేక పోతున్నాడూ. రోహిత్ సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు అవుతోంది. 2021 లో ఇంగ్లాండ్ పై సెప్టెంబర్ లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ వైట్ బాల్  క్రికెట్ లో సెంచరీ  మార్క్ అందుకోలేకపోతున్నాడు అని చెప్పాలి. ఈ ఏడాది ఇప్పటివరకు పొట్టి ఫార్మర్ ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.


 ఇక టెస్ట్ స్పెషల్ టెస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పుజారా సైతం సెంచరీకి దూరంగానే ఉన్నాడూ. 2019 లో  సెంచరీ చేసిన పూజారా ఇప్పుడు వరకు మూడు ఏళ్లుగా సెంచరీ అందుకోలేకపోయాడు. దీంతో అటు  పూజారా టీమిండియాకు క్రమక్రమంగా దూరమవుతున్నాడు.

 ఇక ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న శిఖర్ ధావన్  సైతం సెంచరీకి ఆమడ దూరం లోనే ఉన్నాడు అనేది తెలుస్తుంది. టెస్టుల్లో 7 పరిమిత ఓవర్ల ఫార్మాట్లో 17  సెంచరీలు చేశాడు శిఖర్ ధావన్. గత కొంత కాలం నుంచి పేలవమైన ఫామ్ కారణంగా టెస్ట్ క్రికెట్ తో పాటు టి-20లో కూడా చోటు కోల్పోయాడు. చివరగా  2019 జూన్ 9న ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు. ఇప్పటి వరకు మళ్లీ సెంచరీ మార్క్  అందుకోలేకపోయాడు. కోహ్లీతో పాటు ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా సెంచరీ చేయక పోయినప్పటికీ కోహ్లీ సెంచరీ గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: