మునుపెన్నడూ లేనివిధంగా ఇటీవలకాలంలో టీమిండియా యాజమాన్యం చేస్తున్న ప్రయోగాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా జట్టులో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న సీనియర్ ప్లేయర్లు అందరికీ కూడా వరుసగా విశ్రాంతిని ఇస్తూ వస్తోంది టీమ్ ఇండియా యాజమాన్యం. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బూమ్రా, కె.ఎల్.రాహుల్ లాంటి సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా ఆడిన మ్యాచ్ల కంటే రెస్ట్ తీసుకున్న మ్యాచ్ లే ఎక్కువ. ఇక కొన్ని కొన్ని సార్లు యువ ఆటగాళ్లకు కూడా విశ్రాంతి ఇస్తూ ఉండడం గమనార్హం.


 ఇలా ఆటగాళ్లకు వరుసగా విశ్రాంతిని ఇస్తూ ఉండడం పై మాజీ క్రికెటర్లు మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలుస్తుంది. కాగా ఇటీవల ఇదే విషయంపై మాట్లాడినా టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్   ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏ ప్లేయర్ అయినా సరే బాగా ఆడాలంటే ఫ్రెష్ మైండ్ తో ఉండాల్సి ఉంటుంది. వరుసగా మ్యాచ్ ల మీద మ్యాచ్ లు ఆడుతూ  ఉంటే మానసికంగా అలసిపోతారు. మాకు కూడా కొంచెం రెస్ట్ కావాలి.. మేము కూడా మనుషులమే కదా అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ లో రొటేషన్ పద్ధతి కొత్తేమీ కాదు. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసి ఎక్కడెక్కడో మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కాస్త విశ్రాంతి కావాలి అని కోరుకోవడంలో తప్పేమీ లేదు.


 ఒకవైపు క్రికెట్ని మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. ఇక దీపక్ హుడా సహా ఎంతో మంది యువ ఆటగాళ్లు లేటుగా జట్టులో అవకాశం వచ్చినా బాగా రాణిస్తూ ఉన్నారు. ఇక విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ కోసం ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ప్రతి కోచ్ ప్రతి కెప్టెన్ అనుసరించే విధానం ఒకేలా ఉండకపోవచ్చు అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. ఇక వాళ్ళు ఏం చేసినా జట్టులో మంచి వాతావరణం క్రియేట్ చేసేందుకు ఆలోచన చేస్తూ ఉంటారు అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: