అవును మొన్నటికి మొన్న కేవలం భారత టెస్టు జట్టుకు మాత్రమే పరిమితమైన చటేశ్వర్ పుజారా ఫామ్ కోల్పోవడంతో చివరికి భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ కౌంటీ లలో ఆడుతున్నాడు. మొన్నటికి మొన్న టెస్టుల్లో సెంచరీలు డబుల్ సెంచరీలతో చెలరేగిన చటేశ్వర్ పుజారా.. ఇక ఇప్పుడు వన్డే ఫార్మాట్ లో కూడా అదే రీతిలో చెలరేగి పోతున్నాడు అని చెప్పాలి. ఇక చటేశ్వర్ పుజారా ఆడుతున్న ఇన్నింగ్స్ చూసిన తర్వాత పూజారా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో కూడా ఇంత అద్భుతంగా ఆడగలడా అని ప్రేక్షకులకే ఆశ్చర్యం కలుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఇటీవలే లండన్ వన్ డే కప్ 2022 లో భాగంగా ససెక్స్ జట్టు తరఫున మెరుపు సెంచరీ చేసి వార్తల్లో నిలిచాడు ఛటేశ్వర్ పూజారా. ఈ సెంచరీ గురించి చర్చలు ముగియకముందే ఇప్పుడు మరో సెంచరీతో వార్తల్లోకి వచ్చాడు. 131 బంతుల్లో 5 సిక్సర్లు 20 ఫోర్లతో 174 పరుగులు చేశాడు. అయితే 103 బంతుల్లోనే సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఇక మరో 20 బంతుల్లో 53 పరుగులు పిండుకున్నాడు అని చెప్పాలి. అంతకు ముందు మ్యాచ్ లో 79 బంతుల్లో 107 పరుగులు చేశాడు. ఇలా చటేశ్వర్ పుజారా ఆడుతున్న ఇన్నింగ్స్ చూసిఆశ్చర్యపోవడం అటు క్రికెట్ ప్రేక్షకుల వంతు అవుతుంది అని చెప్పాలి.