అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా అందరికీ ఎంతో ఇష్టమైన టి20 వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు ఎంపిక ప్రస్తుతం ఎంతో కష్టం గా మారిపోయింది. గత ఏడాది టి20 వరల్డ్ కప్ లో భాగంగా దారుణంగా నిరాశపర్చిన టీమిండియా ఈసారి మాత్రం ఎలాంటి తప్పులు చేయకుండా టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది అని తెలుస్తోంది. టి20 వరల్డ్ కప్ కోసం గత కొన్ని రోజుల నుంచే ప్రణాళికలను అమలు లో పెట్టింది బీసీసీఐ.


 మరికొన్ని రోజుల్లో ఈ మెగా టోర్నీకి వెళ్లబోయే భారత జట్టు వివరాలను ప్రకటించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. టి20 ప్రపంచకప్కు భారత జట్టును ఎంపిక చేసేందుకు గాను బిసిసిఐ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కాబోతుందట. ఆసియా కప్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత సెలెక్టర్లు ఇక టి20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టును ప్రకటించబోతున్నట్లు  తెలుస్తుంది. ఈ క్రమంలోనే భారత జట్టులో ఆటగాళ్లను ఆసియా కప్లో ప్రదర్శన ఆధారంగానే ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా టి-20 ప్రపంచ కప్ లో పాల్గొనే జట్ల పూర్తి వివరాలు సెప్టెంబర్ 16 లోపు ప్రకటించాలని ఆయా జట్లకు డెడ్ లైన్ విధించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15వ తేదీన ఆసియాకప్ ముగిసిన నాలుగు రోజుల వ్యవధిలో బిసిసిఐ జట్టు వివరాలు ప్రకటించబోతుంది.


 అయితే ప్రపంచ కప్ కోసం ప్రతి జట్టుకు 15 మంది సభ్యులతో కూడిన టీం ను ఎంపిక చేసే అవకాశం ఉంది. క్రికెటర్లు   నెట్ బౌలర్లు సహాయ సిబ్బంది తో కలిపి మొత్తం 30 మంది వరకూ ఆస్ట్రేలియా కు వెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇక టీమిండియాకు సెలెక్టర్లు కూడా దీనిని దృష్టిలో పెట్టుకుని జట్టు ప్రకటన చేయబోతున్నారు అని తెలుస్తోంది. కాగా టి20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 23 వ తేదీన మెల్బోర్న్ వేదికగా దాయాది దేశమైన పాకిస్థాన్ తొలి మ్యాచ్ ఆడబోతున్నది భారత జట్టు. గత ఏడాది పాకిస్థాన్ చేతిలో ఓడగా.. ఈ ఏడాది మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: