భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ప్రపంచ క్రికెట్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . సాధారణంగా రెండు దేశాలకు సంబంధించిన జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో కేవలం ఇరుదేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే మ్యాచ్ వీక్షించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అనేసరికి ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇందుకు కారణం భారత్-పాకిస్థాన్ జట్లు చిరకాల ప్రత్యర్ధులు కావడం గమనార్హం. అయితే క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల లోనే ఇంత ఉత్కంఠ ఉంటే ఇక మైదానంలో ఆడుతున్న ఆటగాళ్లలో ఇంకెంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


 ఈ క్రమంలోనే జట్టును గెలిపించేందుకు అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే టార్గెట్గా పెట్టుకుంటారు ప్రతి ఆటగాడు. కానీ కొన్నిసార్లు మాత్రం ఆటగాళ్ళకు నిరాశ ఎదురవుతూ ఉంటుంది. అయితే భారత్పై పాకిస్థాన్ విజయం సాధించినా లేదా పాకిస్థాన్పై భారత్ విజయఢంకా మోగించిన కూడా ఓడిపోయిన జట్టు ఆటగాళ్లు తీవ్ర నిరాశలో మునిగిపోతూ ఉంటారు. ఇకపోతే మరికొన్ని రోజులలో ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


 కాగా ఇటీవలే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తన కెరియర్ లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 1986లో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. ఇక ఈ మ్యాచ్ గురించి ఇప్పుడు తలచుకున్నా నిద్ర పట్టదు అంటూ చెప్పుకొచ్చాడు కపిల్ దేవ్. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమైన సమయంలో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మియాందాద్  సిక్సర్ కొట్టి ఇక భారత్ ఓటమి శాసించాడు. అయితే ఈ ఓటమి నుంచి కోలుకోవడానికి తనకు నాలుగేళ్ల సమయం పట్టింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: