ఇలాంటి సమయంలో ఇటీవలే ఐపీఎల్ లో సత్తాచాటిన ఒక యువ పేసర్ కీ టీమిండియా నుంచి పిలుపు వచ్చింది అన్నది తెలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించిన యువ పేసర్ కుల్దీప్ సేన్ బంపర్ ఆఫర్ అందుకున్నాడు. ఆసియా కప్ 2022 టోర్నమెంట్లో భాగంగా యూఏఈ రావాలి అంటూ అతనికి బిసిసిఐ నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే నెట్ బౌలర్గా రోహిత్ ఆర్మీ కి సేవలు అందించబోతున్నాడు అనేది తెలుస్తుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారి తెలిపారు.
అయితే యువ యువ బౌలర్ ఇండియా జట్టులో భాగం కాబోతున్నాడు అనే వార్త బయటకు వచ్చిన తర్వాత జట్టులో స్టార్ ఫేసర్ గా కొనసాగుతున్న దీపక్ చాహర్ మరోసారి గాయపడ్డాడు అని అందరూ భావించారు. దీపక్ చాహర్ స్థానంలోనే కుల్దీప్ సేన్ ను స్టాండ్బై ప్లేయర్ గా తీసుకుని ఉంటారని భావించారు. ఈ వార్తలపై స్పందించిన బీసీసీఐ అధికారి నెట్ ప్రాక్టీస్ బౌలర్గా మాత్రమే అతన్ని టీమిండియా లో భాగం కానున్నాడు అని చెప్పుకొచ్చాడు దీపక్ చాహర్ గాయం బారిన పడ్డాడు అన్న వార్తలు అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చాడు. అతను జట్టుతో కలిసి ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు బిసిసీఐ అధికారి.