ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నా మిని ప్రపంచ కప్ గా పిలవబడే ఆసియా కప్ నేటి నుంచి ప్రారంభం కాబోతోంది అన్న విషయం తెలిసిందే. ఇక మొదటి రోజు మ్యాచ్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ జట్లు తలపడేందుకు  సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే అందరూ ఎదురు చూస్తోంది మాత్రం రేపు జరగబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి అని చెప్పాలి. సాధారణంగానే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు అది హై వోల్టేజీ మ్యాచ్  లా ఉంటుంది.  అలాంటిది ఇక గత ఏడాది ప్రపంచ కప్ లో ఓడిపోయిన భారత్ ఈసారి మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. దీంతో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది అని తెలుస్తుంది.


 రోహిత్ శర్మ కెప్టెన్సీలో పాకిస్థాన్తో మ్యాచ్లో భారత జట్టు బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం పాకిస్థాన్ పై విజయం మాత్రమే కాదు కప్పు కొట్టాలనే ఆశతో ఉంది టీమిండియా. ఇలాంటి సమయంలోనే ఆసియా కప్లో టీమ్ ఇండియా లోని పలువురు ఆటగాళ్లను కొన్ని రికార్డులు ఊరిస్తూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే  కెప్టెన్ రోహిత్ కూడా ఒక రికార్డుకు చేరువలో ఉన్నాడు అన్నది తెలుస్తుంది. టీమ్ ఇండియా తరఫున ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండవ స్థానంలో ఉన్నాడు.


 సచిన్ టెండూల్కర్ ఆసియా కప్ లో 971 పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 883 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ మరో  89 పరుగులు చేస్తే చాలు రోహిత్ శర్మ సచిన్ రికార్డును బ్రేక్ చేసేస్తాడు. ఇక టీమిండియా తరపున ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టిస్తాడు. అయితే కొంతకాలం నుంచి తన ప్రదర్శనతో పర్వాలేదు అనిపిస్తున్న రోహిత్ శర్మ ఆసియా కప్లో ఎలా ఆడబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: