ఇకపోతే నేటి నుంచి ఆసియా కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ ఎంతో కీలకంగా మారబోతున్నాడు అని తెలుస్తోంది. ఒకవేళ అతడు బాగా కుదురుకున్నాడు అంటే చాలు ఇక శ్రీలంక బ్యాట్స్‌మెన్ లకు చుక్కలు చూపించటం ఖాయం అని తెలుస్తోంది. ఒకవైపు బౌలింగ్ ప్రాక్టీస్ లో మునిగితేలిన రషీద్‌ఖాన్ మరోవైపు బ్యాటింగ్ కూడా చేస్తూ ఉన్నాడు. ఇటీవలే రషీద్ ఖాన్ బ్యాటింగ్ చేస్తూ భారీ షాట్లు ఆడుతున్న వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
బౌలింగ్‌లో వికెట్ల తీయడమే కాదు జట్టుకు అవసరమైతే బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించడానికి కూడా నేను సిద్ధమే అన్నట్లుగా ప్రస్తుతం ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్నాడు రషీద్ ఖాన్. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోని స్వయంగా రషీద్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. ఈ వీడియోలో చూసుకుంటే రషీద్‌ఖాన్ కనుగొన్న స్నేక్ షాట్ కూడా ఆడాడు అనేది తెలుస్తుంది. గేమ్ డే ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ కు అంతా సిద్ధమైంది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు రషీద్ ఖాన్.