హై వోల్టేజి మ్యాచ్ గా పిలుచుకునే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఇటీవలే ఆసియా కప్లో భాగంగా ముగిసింది. కానీ ఈ మ్యాచ్ కి సంబంధించిన చర్చలు మాత్రం ఆగడం లేదు అని చెప్పాలి. ఇరు జట్లు హోరాహోరీగా నువ్వానేనా అన్నట్టుగా పోరాడిన తీరు పై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు వాకింగ్ వ్యాఖ్యలతో వార్తలతో హాట్ టాపిక్ గా మారిపోయే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఇటీవల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.


 ఆసియా కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు కూడా ఓడిపోవడానికి ప్రయత్నించాయి అంటూ వ్యాఖ్యానించాడు. రెండు జట్ల లో కూడా టీమ్ సెలక్షన్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదు అంటూ వ్యాఖ్యానించాడు షోయబ్ అక్తర్. టీమిండియాలో రిషబ్ పంత్ ను తీసుకోకుండా కార్తీక్ ను తీసుకోవడం సరైంది కాదు అంటూ తెలిపాడు. అంతేకాకుండా రవీంద్ర జడేజాను ముందుగా బ్యాటింగ్ దింపడం బాలేదు అంటూ వ్యాఖ్యానించాడు షోయబ్ అక్తర్. అంతేకాకుండా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ వన్ డౌన్ లో బ్యాటింగ్ కి వస్తే బాగుంటుంది అంటూ తెలిపాడు.


 భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ కి ఒక బ్యాడ్  డే లాంటిది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నువ్వానేనా అన్నట్టుగా హోరాహోరీగా జరిగిందని.. అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందిందని.. మ్యాచ్ అంటే ఇలాగే ఉండాలని ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే.. ఇక ఇప్పుడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్  చేసిన వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయాయ్ అని చెప్పాలి.  కాగా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో చివరి బంతికి హార్దిక్ పాండ్యా సిక్సర్తో ముగించడంతో 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్పై విజయం సాధించింది భారత జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: