రషీద్ ఖాన్.. ఈ పేరు వింటే చాలు బ్యాట్స్మెన్ల వెన్నులో వణుకు పుడుతుంది. ఎంతటి  అత్యుత్తమ బ్యాట్స్మెన్ అయినా సరే రషీద్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నాడంటే కాస్త వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏదైనా మంచి బంతి వస్తేనే సిక్సర్  కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.  అంతేకానీ రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఉతికి ఆరవేయాలి.. సిక్సర్లతో చెలరేగిపోవాలి అని అనుకోరు అని చెప్పాలి. ఎందుకంటే రషీద్ ఖాన్ తన స్పిన్ బౌలింగ్ తో అంతా మాయ చేస్తూ ఉంటాడు. ఎంతటి దిగ్గజ బ్యాట్స్మెన్ ను  అయినా సరే తికమక పెడుతూ వికెట్లు పడగొడుతూ  వుంటాడు రషీద్ ఖాన్.


 ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్ గా ఎదిగిన  రషీద్ ఖాన్ బౌలింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరఫున మాత్రమే కాదు అటు ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఎన్నో ఏళ్ల పాటు  ప్రాతినిధ్యం వహించి కోట్ల మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. అయితే కేవలం బౌలింగ్లో మాత్రమే కాదు జట్టుకు అవసరమైనప్పుడు బ్యాటింగ్లో కూడా మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు రషీద్ ఖాన్. ఇక ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రషీద్ఖాన్.. ఇక ఇటీవల టి20 క్రికెట్ లో మరో అరుదైన ఘనతను సాధించాడు అని చెప్పాలి.


 ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రషీద్ఖాన్ మూడు వికెట్లు తీశాడు అన్న విషయం తెలిసిందే. తద్వారా అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్నాడు ఈ ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్.  నాలుగు ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు రషీద్ ఖాన్. బంగ్లాదేశ్తో మ్యాచ్ కి ముందు 112 వికెట్లతో ఉన్నాడు. ఇక ఇటీవలే మూడు వికెట్లు తీయడంతో 115 వికెట్లతో టీమ్ సౌదీని  అధిగమించాడు రషీద్ ఖాన్. రషీద్  కంటే ముందు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ 122 వికెట్ లతో  అగ్రస్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: