అందుకే బంగ్లాదే విజయం అని అంతా అనుకున్నారు. అందుకు తగిన విధంగా శ్రీలంక ఛేజింగ్ లో ఏ దశలోనూ పాజిటివ్ గా లేదు. పవర్ ప్లే లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఒక వైపు కుశాల్ మెండిస్ మాత్రం కెప్టెన్ శనక తో కలిసి లక్ష్యం వైపు దూసుకెళ్లాడు. కానీ కీలక సమయంలో మెండిస్ మరియు శనక లు అవుట్ కావడంతో ఇక లంక పని అయిపోయింది అనుకున్నారు. కానీ బౌలర్లు దగ్గరుండి మరీ ఉత్కంఠను అదిగమించి లంకను సూపర్ 4 కు చేర్చారు. నాలుగు బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
అయితే మొదటి ఇన్నింగ్స్ తర్వాత బంగ్లాదేశ్ దే విజయం అనుకున్నారు. కానీ కెప్టెన్ షకీబ్ చేసిన పొరపాటు కారణంగా ఆసియ కప్ నుండి ఏమీ సాధించకుండానే కనీసం సూపర్ 4 కు కూడా వెళ్లకుండా నిష్క్రమించింది బంగ్లాదేశ్. మాములుగా ఎటువంటి టీం అయినా ఏ కెప్టెన్ అయినా చివరి ఓవర్ లను ఖచ్చితంగా ఫాస్ట్ బౌలింగ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు. కానీ ఇక్కడ షకీబ్ మాత్రం ముందుగానే ఫాస్ట్ బౌలర్లను వాడి చివరి మూడు ఓవర్లలో రెండు స్పిన్ కి ఒక పేస్ కు ఉండేలా చేశాడు. దీనితో శ్రీలంక బౌలర్లకు కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా స్పిన్ బౌలింగ్ లో పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.