ఈ క్రమంలోనే హర్ష దీప్ సింగ్ కారణంగానే టీమ్ ఇండియా మ్యాచ్ ఓడిపోయింది అంటూ ఎంతో మంది భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం. సాధారణంగా ఇతర జట్లపై ఇలా జరిగి ఉంటే పట్టించుకునేవారు కాదేమో కానీ పాకిస్థాన్పై ఇలా కీలకమైన క్యాచ్ వదిలేయడం.. టీమిండియా ఓడిపోవడంతో ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను బౌలింగ్లో సరిగ్గా రాని చేయకపోగా ఇక మ్యాచ్ స్వరూపాన్ని మార్చే క్యాచ్ ను కూడా వదిలేసి భారత ఓటమికి కారణమయ్యాడు అంటూ విమర్శలు చేస్తున్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే హర్ష దీప్ సింగ్ కు ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రస్తుత క్రికెటర్లు కూడా మద్దతుగా నిలుస్తున్నారు అని చెప్పాలి.
కాగా ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హర్ష దీప్ సింగ్ కి మద్దతు గా నిలిచాడు. ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా క్యాచ్ వదిలేయాలని అనుకోరు. హర్ష దీప్ సింగ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. అతని విమర్శించడం మానుకోవాలి అంటూ సూచించాడు. క్యాచ్ వదిలేసిన విషయాన్ని కాదు పాకిస్తాన్ మెరుగ్గా ఆడిన విషయాన్ని గమనించాలని.. అంతేకాని భారత జట్టుపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికాడు. ఇటీవలే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసాడు హార్భజన్ సింగ్.