ఆసియా కప్ లో భాగంగా భారత్ ప్రయాణం ముగిసింది . ఈసారి అద్భుతంగా రాణించి ఆసియా కప్ గెలుస్తుంది అని భారత అభిమానులు అందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ వ్యూహాలను గట్టిగా నమ్మారు.  కానీ లీగ్ దశ మ్యాచ్ లలో వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా సూపర్ 4 లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది. ఇక శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో చివరికి ఫైనల్ వెళ్లే అవకాశాలను కోల్పోయింది.


 ఇక నేడు కేవలం నామమాత్రమైన  మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ తో ఆడ బోతుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్లో కూడా గెలుస్తుందా ఓడుతుందా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఆసియా కప్ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో ఎంతోమంది  మాజీ క్రికెటర్లు స్పందిస్తూ టీమిండియా పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా  ఇదే విషయంపై హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు. యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్, వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదు అంటూ హర్భజన్ ప్రశ్నించాడు.


 ఈ ముగ్గురికి మ్యాచ్ లో ఆడే అర్హత లేదా అంటూ ప్రశ్నించాడు. దినేష్ కార్తీక్ కు అసలు ఎందుకు అవకాశాలు దొరకడం లేదు అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ముగ్గురు జట్టులో ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు హర్భజన్ సింగ్. అయితే ఆసియా కప్ లో టీమిండియా పేలవ ప్రదర్శన చేసిన నేపథ్యంలో అటు రోహిత్ శర్మ కెప్టెన్సీ పై విమర్శలు వస్తున్నాయని చెప్పాలి. రోహిత్ శర్మ తన కెప్టెన్సీ తో ఏదో చేస్తాడు అనుకుంటే చివరికి మొదటి టోర్నీ లోనే నిరాశపరిచాడు అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: