టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటీవలే ఆసియా కప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అప్పుడు వరకు కేవలం హాఫ్ సెంచరీలు మాత్రమే చేసి సరిపెట్టుకున్న విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్  తో జరిగిన మ్యాచ్ లో మాత్రం వీర విహారం చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే 60 బంతుల్లో 122 పరుగులు చేసి అజేయ సెంచరీతో అటు జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. 101 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది అని చెప్పాలి.


 ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడం ద్వారా తన కెరియర్లో 71వ సెంచరీ సాధించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టి20 కెరీర్ లో మొదటి సెంచరీ నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ తన కెరియర్లో 71 సెంచరీలు చేయడానికి 522 ఇన్నింగ్సులో ఆడాడు అని చెప్పాలి. అయితే కోహ్లీ 71 సెంచరీలు సాధించిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ లో ఎవరు ఎక్కువ సెంచరీలు సాధించారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకసారి ఆ లిస్టు చూసుకుంటే ప్రస్తుత క్రికెట్ లో ఎవరు కూడా విరాట్ కోహ్లీ కి దరిదాపుల్లో లేరు అని చెప్పాలి.



 522 ఇన్నింగ్సులో 71 సెంచరీలతో విరాట్ కోహ్లీ షాక్ లో కొనసాగుతున్నాడు.  405 ఇన్నింగ్సులో జో రూట్ 44 సెంచరీలు చేసి రెండవ స్థానంలో ఉండడం గమనార్హం.  403 ఇన్నింగ్సులో డేవిడ్ వార్నర్ 42 సెంచరీలతో మూడవ స్థానంలో ఉన్నాడు. 431 ఇన్నింగ్సులో నలభై ఒక్క సెంచరీలు చేసిన రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక 328 ఇన్నింగ్స్ లో 40 సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 5వ స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం. మూడు ఫార్మాట్లలో కలిపి ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ టాప్ లో ఉండగా టాక్ ఫైవ్ లిస్ట్ ఈ విధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: