ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం అత్యుత్తమ క్రికెటర్ ల పేరు తీస్తే మొదట వినిపించే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఇదే మాట చెబుతూ ఉంటారు. అంతలా తన ఆటతీరుతో ప్రభావితం చేశాడు విరాట్ కోహ్లీ.  మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేసి ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బౌలర్లు  ఎంత కఠినమైన బంతిని విసిరినా.. ఎంతో అలవోకగా..  టెక్నికల్ షాట్స్ తో బౌండరీకి తరలించగల సత్తా విరాట్ కోహ్లీ సొంతం అని చెప్పాలి.


 అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటివరకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విరాట్ కోహ్లీ అభిమానులందరి తో కూడా రన్ మిషన్, రికార్డుల రారాజు అని పిలుచుకుంటూ ఉంటాడు. ఇకపోతే ఇప్పటివరకూ ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ లు సాధించిన రికార్డులని అలవోకగా ఛేదించిన విరాట్ కోహ్లీ ఐసిసి ర్యాంకింగ్స్ లో కూడా సత్తా చాటుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఎన్నో రోజుల పాటు నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగాడు. గత కొంత కాలం నుంచి ఫామ్ కోవడంతో కోహ్లీ ర్యాంక్ అంతకంతకు దిగజారిపోయింది.


 కానీ ఇటీవలే ఆసియా కప్లో భాగంగా మళ్లీ మునపటి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించాడు. మూడేళ్ల తర్వాత సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టి-20 ర్యాంకింగ్స్ లో మరోసారి దూసుకు వచ్చాడు. ఇటీవల విడుదల చేసిన టి-20 ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ క్రికెటర్  నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ నెంబర్ వన్ స్థానం లో  కొనసాగుతుండగా.. ఇక రెండో స్థానంలో కొనసాగుతున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఉండగా రోహిత్ శర్మ 14వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.  కోహ్లీ 15వ స్థానంలో ఉండడం గమనార్హం. అయితే ఆసియా కప్ ముందు వరకు 33 వ ర్యాంక్ లో ఉన్న కోహ్లీ.. సరిగ్గా 18 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి రావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: