ఈ క్రమంలోనే పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో వేగంగా సెంచరీ చేసి అదరగొట్టాడు. 61 బంతుల్లోనే 122 పరుగుల చేసి అభిమానులందరినీ కూడా ఆనందోత్సాహాల్లో ముంచేశాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ పై అందరూ ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు. ఇటీవలే మళ్లీ పరుగుల వేట ప్రారంభించిన విరాట్ కోహ్లీ ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కూడా తన ర్యాంక్ ను అంతకంతకు మెరుగు పరుచుకుంటూ దూసుకు వస్తున్నాడు అని చెప్పాలి.
మొన్నటి వరకు ర్యాంకింగ్లో అంతకంతకూ ర్యాంక్ పడిపోయిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మాత్రం ఐసీసీ విడుదల చేసిన టి-20 ర్యాంకింగ్స్లో దూసుకొచ్చాడు. అంతేకాదు అరుదైన రికార్డు కూడా సాధించాడు అంతర్జాతీయ టీ20లో చేజింగ్ మ్యాచుల్లో 18 సార్లు 50కి పైగా పరుగులు చేసిన ఏకైక మెన్స్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు కోహ్లీ. మరోవైపు భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన పదిసార్లు 50 కి పైగా పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇలా ఒక వైపు పురుషుల క్రికెట్లో మరో వైపు మహిళల క్రికెట్ లో భారత బ్యాటర్ లే హవా నడిపిస్తు దూసుకుపోతూ ఉండటం గమనార్హం