ఇలా ఇటీవలి కాలంలో ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్ కారణంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అని చెప్పాలి. అయితే ఎంతో మంది మాజీ క్రికెటర్లు అప్పుడప్పుడు స్పందిస్తూ ఇండియన్ క్రికెటర్ లతో ఐపీఎల్ కారణంగా ఏర్పడిన బంధాల గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు చాంపియన్ జట్టు గా కొనసాగుతుంది. ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచింది. కాగా రోహిత్ శర్మ కంటే ముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వ్యవహరించాడు.
ఈ సమయంలో ప్రస్తుతం క్రికెట్ లో ఉన్న ఎంతో మంది మాజీ పేర్లు కూడా సచిన్ కు సహచరులుగా ఉన్నారు. ఒకప్పుడు ముంబై ఇండియన్స్ లో భాగం అయిన శ్రీలంక మాజీ ఓపెనర్ జయసూర్య సచిన్ తో సంబంధం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై తన రెండో ఇల్లు అంటూ పేర్కొన్నాడు. ఐపీఎల్లో ముంబై తరఫున ఆడినప్పుడు సచిన్తో కలిసి బ్యాటింగ్ చేయడం ఎంతగానో ఎంజాయ్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. మేనేజ్మెంట్ స్వేచ్ఛగా ఆడేందుకు ఎప్పుడు అవకాశం ఇవ్వడంతో తాము అనుకున్న విధంగానే పక్కాగా ప్లాన్ అమలు చేసి చేసి విజయాలు సాధించే వాళ్ళం అంటూ చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్ ఎప్పుడూ సరదాగా ఉంటూ డ్రెస్సింగ్ రూమ్ లో అందరిని నవ్వించే వాడు అంటూ జయసూర్య చెప్పుకొచ్చాడు.