దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియం ఒక అంతర్జాతీయ మ్యాచ్ కోసం ముస్తాబయింది అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు అందరిలో కూడా ఎంతో ఉత్కంఠ నెలకొల్పిన మూడవ టి20 మ్యాచ్ నేడు జరగబోతుంది. ఈ క్రమంలోనే కొంతమంది నేరుగా మ్యాచ్ వీక్షించేందుకు సిద్ధమైతే మరి కొంతమంది టీవీల ముందు కూర్చుని ఫ్యామిలీతో మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే నేడు జరగబోయే నిర్ణయాత్మకమైన మూడవ టి20 మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 అదే సమయంలో టీమిండియా ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లకు సంబంధించిన ఘనాంకాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.. భారత్ ఆస్ట్రేలియా జట్లు ఉప్పల్ స్టేడియంలో ముఖాముఖిగా నాలుగు సార్లు తలపడగా.. ఇందులో మూడు వన్డేలు ఒక టెస్ట్ ఉండడం గమనార్హం. కాగా ఇందులో రెండుసార్లు భారత్ రెండు సార్లు ఆస్ట్రేలియా రెండుసార్లు గెలిచి సమవుజ్జీలుగా ఉన్నాయి. అయితే టి20 ఫార్మాట్ లో మాత్రం మొదటిసారి ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య పోరు జరగబోతుంది అన్నది తెలుస్తుంది.

 2007 అక్టోబర్ 5వ తేదీన ధోని సారథ్యంలో.. 2009 నవంబర్ 5వ తేదీన మరోసారి ఆస్ట్రేలియా భారత్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా వన్డే మ్యాచ్ జరిగింది. 2007 లో జరిగిన మ్యాచ్లో 47 పరుగుల తేడాతో,  2009లో జరిగిన మ్యాచ్లో మూడు పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది.  కానీ 2013లో ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ జరగగా.. 135 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇక 2019లో ఆస్ట్రేలియా భారత్ మధ్య వన్డే మ్యాచ్ జరగగా భారత్ విజయం సాధించడం గమనార్హం. మరి నేడు ఎవరు గెలుస్తారో చూడాలి. అయితే పొట్టి ఫార్మాట్లో ఈ రెండు జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ కావడం మరింత ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: