ఇటీవల భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ తీసిన వికెట్ గురించి అంతర్జాతీయ క్రికెట్ లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. క్రికెట్ లో ఉన్న మన్కాడింగ్ అనే ఒక రూల్ ని ఉపయోగించుకున్న దీప్తి శర్మ ఇంగ్లాండ్ 10వ వికెట్ను పడగొట్టి ఇక టీమిండియా కు విజయాన్ని అందించింది అని చెప్పాలి. అయితే మన్కడింగ్ విధానాన్ని దీప్తి శర్మ ఉపయోగించడం పై ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లాండు పర్యటనలో ఉంది.  అక్కడ ఇప్పటికే టీ20 సిరీస్ ముగించుకుంది. టి20 సిరీస్ లో ఓడిపోయిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్ లో మాత్రం అద్భుతంగా రాణించింది.


 వరుసగా మూడు వన్డే మ్యాచ్లలో  కూడా విజయం సాధించి ఇంగ్లాండ్ జట్టును సొంత గడ్డపైనే క్లీన్ స్వీప్  చేసింది భారత మహిళల జట్టు. ఇక మూడవ వన్డే మ్యాచ్లో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో దీప్తి శర్మ ఏకంగా మన్ కడింగ్  విధానాన్ని ఉపయోగించి వికెట్ పడగొట్టింది అన్న విషయం తెలిసిందే. దీంతో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా దీప్తి శర్మ ప్రవర్తించింది అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఫ్యాన్స్ దీప్తి శర్మను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

 ఇక ఇలాంటి సమయంలోనే అటు భారత మాజీ క్రికెటర్లు దీప్తి శర్మకు అండగా నిలబడుతూ ఉండడం గమనార్హం. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ ను మన్కడింగ్  విధానంలో దీప్తి శర్మ వికెట్ తీసింది అని విమర్శలు చేస్తున్నారు. కానీ ఆ రూల్ రాసింది ఇంగ్లాండే అన్న విషయాన్ని మర్చిపోవద్దు అంటూ గుర్తు చేస్తున్నారు భారత మాజీ క్రికెటర్లు. అది క్రికెట్ నిబంధనలకు విరుద్ధం ఏమీ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2019 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఫిల్టర్ విసిరిన బంతి బెన్ స్టోక్స్ బ్యాట్ కి తగిలి బౌండరీ వెళ్లి పరుగులు రావడం రూల్ ప్రకారం జరిగినప్పుడు ఇది కూడా క్రికెట్లో రూల్స్ ప్రకారమే జరిగింది అంటూ అభిప్రాయపడుతున్నారు భారత మాజీ క్రికెటర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: