గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్లో తిరుగులేని ప్రస్తానని కొనసాగిస్తుంది టీం ఇండియా. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్ గా వచ్చిన తర్వాత టి20 ఫార్మట్ లో టీమిండియా ప్రదర్శిస్తున్న ఆధిపత్యం అంతా ఇంతా కాదు. అయితే అప్పుడప్పుడు పలు మ్యాచ్లలో ఓడిపోయి నిరాశ పరుస్తున్నప్పటికీ ఎక్కువ మ్యాచ్లలో మాత్రం విజయం సాధిస్తూ ఉంది టీమ్ ఇండియా. ముఖ్యంగా ద్వైపాక్షిక సిరీస్లలో అయితే ప్రత్యర్థులను క్లీన్ స్వీప్ చేస్తూ ఉండడం గమనార్హం.


 ఇకపోతే ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుపై కూడా టీమ్ ఇండియా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఏకంగా మూడు టి20 సిరీస్ లో భాగంగా రెండు మాచ్యులలో విజయం సాధించిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపించినప్పటికీ బుమ్రా జట్టులోకి రావడంతో ఇక బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల టీ20 లలో ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది టీం ఇండియా. మూడో టి20 మ్యాచ్ లో విజయం సాధించడం కారణంగా.. ఇక ఈ ఏడాది మొత్తంలో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది.


 ఇప్పుడు వరకు ఈ ఏడాదిలో 29 టి20 మ్యాచ్ లు ఆడిన టీమిండియా 21 విజయాలు నమోదు చేసింది. దీంతో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా టాప్ లోకి వచ్చేసింది. అదే సమయంలో ఏడాది అత్యధిక విజయాలు సాధించిన జట్లలో పాకిస్తాన్ 20 విజయాలతో తర్వాత స్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం.  కాగా ప్రస్తుతం పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య టి20 సిరీస్ జరుగుతూ ఉండగా మరో విజయం సాధిస్తే అటు పాకిస్తాన్ కూడా భారత రికార్డును సమం చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం భారత్ ప్రపంచ రికార్డు సాధించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: