మొన్నటికి మొన్న ఐపీఎల్ లో అదిరిపోయే ప్రదర్శన చేసిన అర్షదీప్ సింగ్ ఇక టీమిండియా సెలెక్టర్ల చూపును ఆకర్షించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపిఎల్ ముగిసిందో లేదో ఆ తర్వాత టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకున్నాడు అర్షదీప్ సింగ్. టీమ్ ఇండియాలోకి వచ్చిన తర్వాత తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసిన అందరూ బౌలర్లు టీమిండియాలోకి వస్తారు. అందరూ నిలదొక్కుకోలేరు. ఇక అర్షదీప్ సింగ్ కూడా ఈ కోవలోకి చెందిన వాడే అని అందరూ అనుకున్నారు.


 అయితే టీం ఇండియాలోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు వచ్చి అలాగే పాతుకుపోతాను అనే విషయాన్ని తన బౌలింగ్ తో నిరూపిస్తున్నాడు అర్షదీప్ సింగ్. టీమిండియా కు ఫ్యూచర్ బౌలర్గా అందరిలో నమ్మకాన్ని కలిగిస్తున్నాడు అని చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్ లో తక్కువ అనుభవం లేకపోయినప్పటికీ  కీలకమైన డెత్ ఓవర్లలో కూడా తన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. ఒకవైపు పరుగులను కట్టడం చేస్తూనే మరోవైపు వికెట్లను కూడా పడగొడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. తద్వారా టీమిండియా తరఫున వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు.


 ఇకపోతే ఇటీవల సఫారీలతో టి20 సిరీస్ లో భాగంగా భారత్ ఘనంగా ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. తిరువనంతపురం వేదికగా జరిగిన మొదటి టి20 మ్యాచ్లో విజయం సాధించింది టీమిండియా. అది కూడా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకోవడం గమనార్హం. అయితే భారత విజయంలో యువ బౌలర్ అర్షదీప్ సింగ్ కీలకపాత్ర వహించాడు. తన బౌలింగ్తో మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోని మ్యాచ్ అనంతరం మాట్లాడిన అర్షదీప్ సింగ్ 3వికెట్లలో డేవిడ్ మిల్లర్ వికెట్ ను తాను ఎంతగానో ఎంజాయ్ చేసాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: