ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ ఎంతో అల్లారూ ముద్దుగా పెంచిన డేవిడ్ మిల్లర్ కూతురు ఇటీవల ప్రాణాలు వదిలింది. దీంతో డేవిడ్ మిల్లర్ గుండె పగిలేనంత పని అయింది. ఈ విషయం తెలిసి అటు అభిమానులు అందరూ కూడా దిగ్బ్రాంతిలో మునిగిపోయారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఈ విషయాన్ని డేవిడ్ మిల్లర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఇక డేవిడ్ మిల్లర్ పెట్టిన పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
అయితే స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ కూతురు క్యాన్సర్ తో బాధపడుతుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎన్నో రోజుల నుంచి క్యాన్సర్ చికిత్స చేసినప్పటికీ ఆమెకు నయం కాలేదు. చివరికి క్యాన్సర్ తో పోరాడుతూ ఆ చిన్నారి కన్ను మూసింది. దీంతో స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇక తన చిన్నారి పాపతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు తన చిన్నారి పాపతో ఆడుకుంటున్న వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది చూసి అటు అభిమానులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు అని చెప్పాలి.