సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో కొంతమంది క్రికెటర్లు మైదానంలో పాదరసంలా కదులుతూ మెరుపు ఫీల్డింగ్ చేస్తూ ఉంటారు అసాధ్యం అనుకున్న దాన్ని కూడా సుసాధ్యం అని చేసిన నిరూపిస్తూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే తమ ప్రదర్శనతో ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటారు. ఇలా ఎవరైనా ఆటగాడు మెరుపు ఫీల్డింగ్ చేశాడు అంటే చాలు. అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక అలాంటి మెరుపు ఫీల్డింగ్ చూసి అటు క్రికెట్ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ జట్ల మధ్య ముక్కోనపు టి20 సిరీస్ జరుగుతుంది. న్యూజిలాండ్ వేదికగా ఈ సిరీస్ జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఇటీవల న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే పాకిస్తాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలుపొందినప్పటికీ ఇక అటు న్యూజిలాండ్ వికెట్ దివాన్ కాన్వే ఫీల్డింగ్ మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది.


 పరుగులను కట్టడి చేయడానికి అతడు చేసిన సాహసం అందరి మనసులు గెలుచుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతను చేసిన మెరుపు ఫీల్డింగ్ గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. సహచర ఆటగాళ్లు మాత్రమే కాదు ప్రత్యర్ధులు కామెంటెటర్లు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. చివరి క్షణంలో అద్భుతంగా బౌండరీ ఆపి పరుగులను కట్టడి చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సౌతి బౌలింగ్ చేస్తున్న సమయంలో బ్యాటింగ్ చేస్తున్న షాదాబ్ స్కూప్ షాట్  ఆడాడు. అయితే ఆ షాట్ కు బంతి తప్పకుండా ఫోర్ పోవాల్సిందే. కీపర్ డేవాన్ కాన్వే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని సరిగ్గా భౌదరి లైన్ దగ్గర తన కాళ్ళతో ఆపేశాడు.  తద్వారా రెండు రన్స్ సేవ్ చేశాడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: