
కాగా ఇటీవల ఒక ఫుట్బాల్ ప్లేయర్ కు సంబంధించి యువరాజ్ సింగ్ పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో ట్విట్టర్ వేదికగా ఎంతో మంది నెటిజెన్లు అతని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇటీవల ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో తన కెరియర్లో 700వ గోల్ సాధించాడు. అయితే ఇప్పటివరకు 700 గోల్స్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్ క్రిస్టియన్ రోనాల్డో కావడం గమనార్హం. అయితే ఇక ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతోమంది అభిమానులు క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా క్రిస్టియానో రోనాల్డో కి అభినందనలు చెబుతున్నారు.
ఈ క్రమంలోని యువరాజ్ సింగ్ కూడా క్రిస్టియానో రోనాల్డో 700 గోల్స్ సాధించడం పై అభినందిస్తూ క్రికెట్ భాషను వాడేసాడు. చివరికి పప్పులో కాలేసాడు. దీంతో నేటిజన్లు అతని ఆడుకుంటున్నారు. కింగ్ ఈజ్ బ్యాక్.. ఫామ్ తాత్కాలికం.. కానీ క్లాస్ శాశ్వతం.. 700 క్లబ్ కు స్వాగతం రోనాల్డ్. నెంబర్ సెవెన్ గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైం అంటూ ట్విట్ చేశాడు. అయితే 700 గోల్స్ క్లబ్ రోనాల్డో తప్ప ఇంకా ఎవరూ లేరు. దీనిపై నేటిజన్స్ స్పందిస్తూ 700 క్లబ్లో ఉన్నది ఒక్కటే ఒక్కడు. అది రోనాల్డో మాత్రమే. మళ్లీ క్లబ్ కు స్వాగతం ఏంటి.. ఇంతకుముందు నువ్వేదో ఇందులోఉన్నావా.. లేకపోతే ఏదైనా కొత్త క్లబ్ ఓపెన్ చేసావా అంటూ కామెంట్ చేస్తున్నారు.