ఒకప్పుడు పాకిస్తాన్ జట్టును భారత్ ప్రత్యర్థిగా లెక్క చేసేది కాదని కానీ ఇటీవలే కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ జట్టు నమోదు చేస్తున్న విజయాలను చూసి.. ఇక తమకు దీటుగా పోటీ ఇచ్చేది పాకిస్తాన్ అని భారత్ భావిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా తమను పాకిస్తాన్ ఓడించగలదు అని భావిస్తుంది. అందుకే పాకిస్తాన్ జట్టును గౌరవిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారగా ఇటీవల ఇదే విషయంపై భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
అతను అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడన్న విషయం కూడా నాకు తెలియదు. అయితే గెలుపోటములు కారణంగా ప్రత్యర్థిని గౌరవించడం జరగదు అంటూ చెప్పుకొచ్చాడు. అది మన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇది క్రికెట్.. రెండు దేశాల మధ్య పోరు.. ప్రజలకు ఎంతో కీలకమైనది. ప్రత్యర్థిని గౌరవించడం అనేది మనం ఎలాంటి వాళ్ళం అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. వారు మమ్మల్ని గౌరవిస్తారు కాబట్టి మేము కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ ను గౌరవిస్తాం. రాజకీయ ఒత్తిడిలు, జట్ల మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉన్నా.. పోటీ చాలా పెద్దది. క్రికెటర్ గా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అది గెలుపోవటములలో భాగం మాత్రమే అని తెలుసుకోవాలి అంటూ రవిచంద్రన్ అశ్విన్ రమిజ్ రాజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.