బీసీసీ అధ్యక్ష పదవి మార్పు గురించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మరోసారి ఆ పదవిని ఆశించారు అన్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో మరోసారి బీసీసీ చైర్మన్ పదవిలో కొనసాగేందుకు చాలానే మంతనాలు జరిపారు. కానీ చివరికి ఆయనకు నిరాశ ఎదురయింది. బీసీసీఐ పెద్దలు ఆయనను మరోసారి పదవిలో కొనసాగించేందుకు మొగ్గుచూపులేదు. చివరికి సౌరబ్ గంగూలీ ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


 కాగా కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోజర్ బిన్నీ బిసిసిఐ అధ్యక్షుడిగా వస్తాడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలిసి నాకు ఎంతో ఆనందంగా ఉంది.. ప్రపంచ కప్ లో నా సహచరుడు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం అతనికి ఉంది. ఇక ఇప్పుడు అత్యున్నత పోస్టులోకి రాబోతున్నాడు. ఇక బిసిసిఐ చరిత్రలో భారత్కు తొలి వన్డే ప్రపంచ కప్ను అందించిన జట్టు సభ్యుడు ఇక ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడుగా రావడం అద్భుతం అంటూ తెలిపాడు రవి శాస్త్రి.


 అదే సమయంలో రెండోసారి బీసీసీ అధ్యక్ష పదవిని సౌరబ్ గంగూలీ ఆశించడం గురించి కూడా స్పందించాడు. భారత క్రికెట్ చరిత్రలో రెండోసారి బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్నవారు ఎవరూ లేరు. ఇప్పుడు మరో క్రికెటర్ కి అవకాశం వచ్చిందనుకోవాలి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. కొంతకాలం కేటాయించిన విధులు నిర్వహించడమే మన బాధ్యత. తర్వాత ముందుకు సాగిపోవడమే జీవితం. ఇక రోజర్ బిన్నీ సామర్థ్యం ప్రశ్నించలేం. అతనికి బిసిసిఐ అధ్యక్షుడిగా అయ్యేందుకు అన్ని  అర్హతలు కూడా ఉన్నాయి. ఇక అతను అధ్యక్షుడిగా మారిన తర్వాత అందరి క్రికెటర్లకు న్యాయం చేయగలడని భావిస్తున్నాఅంటూ రవి శాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: