నేటి నుంచి ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం అయినప్పటికీ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న హాట్ ఫేవరెట్ మ్యాచ్ మాత్రం ఈనెల 23వ తేదీన జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇంతకీ ఇలా ప్రేక్షకులందరికీ దృష్టిని ఆకర్షించిన హాట్ ఫేవరెట్ మ్యాచ్ ఏదో కాదు.. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్. దశాబ్దాలు గడిచిపోతున్న కూడా ఈ రెండు దేశాల మధ్య జరిగ పోయే మ్యాచ్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు అని  చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఈ రెండు దేశాలు పోటీ పడుతూ ఉంటాయి.


 ఇకపోతే అక్టోబర్ 23వ తేదీన టీం ఇండియా పాకిస్తాన్ జట్లు హోరాహోరీగా తలబడుతూ టి20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ ఆడబోతున్నాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఇక ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాతో జరగబోయే మ్యాచ్ పై పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అటు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ లతో ట్రై సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల  ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు బాబర్ అజాం.


 వరల్డ్ కప్ కోసం ముఖ్యంగా టీమిండియాతో మ్యాచ్ కోసం సన్నతమయ్యే క్రమంలో తాము న్యూజిలాండ్ బంగ్లాదేశ్ తో వరల్డ్ కప్ కి ముందు ట్రై సిరీస్ లో పాల్గొన్నాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో ఉత్కంఠ ఉంటుంది. ఇక అలాంటి మ్యాచ్లో ప్రశాంతమైన మైండ్ సెట్ తో ఉండడం ఎంతో ముఖ్యం. అప్పుడే మెరుగ్గా ఆడగలుగుతాం. టీమ్ ఇండియాతో మ్యాచ్లో కచ్చితంగా పూర్తి స్థాయిలో 100కు 100 శాతం బెస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం అంటూ బాబర్ అజం చెప్పుకొచ్చాడు. ఇక న్యూజిలాండ్ బంగ్లాదేశ్ తో ట్రై సిరీస్ ఆడటం వెనక కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: