ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్లలో టీమిండియా మునిగి తేలుతుంది అని చెప్పాలి. ఇప్పటికే ఆస్ట్రేలియా తో వార్మప్ మ్యాచ్ విజయంతో ముగించిన టీమ్ ఇండియా.. నేడు న్యూజిలాండ్తో వార్మప్ మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఈనెల 23వ తేదీన జరగబోయే పాకిస్తాన్ భారత్ మ్యాచ్ గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా సైతం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం జరగబోయే తొలి మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును భారత జట్టు ఓడించగలిగితే ఇక టి20 వరల్డ్ కప్ ను టీమిండియా ఎంతో సునాయాసంగా గెలిచి తీరుతుంది అటు సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.
ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్ అంటే చాలు ఆటగాళ్లలో ఎంతగానో ఒత్తిడి ఉంటుంది. ఇక రోహిత్ సేన ఇలా ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్లో బాగా రాణించి విజయం సాధించింది అంటే ఇక మిగతా జట్లతో జరిగే మ్యాచ్ లలో అలవోకక విజయం సాధిస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే సమయంలో ఇక బుమ్రా లాంటి కీలక బౌలర్ జట్టుకు దూరం అవడం నిజంగా టీమిండియా కు ఎదురుదెబ్బే అంటూ వ్యాఖ్యానించాడు. అయితే బుమ్రా స్థానంలో మహమ్మద్ షమిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం అంటూ తెలిపాడు సురేష్ రైనా.