అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కొనసాగించే ఆదిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశీ పర్యటనకు వెళ్లిన లేదా సొంత గడ్డపై మ్యాచ్లు ఆడిన కూడా ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తూ అద్భుతమైన విజయాలను సాధిస్తూ ఉంటుంది టీమిండియా. అయితే ఇలా ద్వైపాక్షిక సిరీస్లలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా గత కొన్నేళ్ల నుంచి మాత్రం వరల్డ్ కప్ లో డీల పడిపోతుంది అని చెప్పాలి. టీమిండియా వరల్డ్ కప్ ను ముద్దాడి దాదాపు 15 ఏళ్లు గడిచిపోతుంది.


 ఈ 15 ఏళ్ల కాలం లో టీమిండియా కి కెప్టెన్లు మారినా కూడా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు అని చెప్పాలి. ఇక ఇప్పుడు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో మరోసారి టీమిండియా అటు విశ్వ విజేతగా నిలిచేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఇక ఈసారి ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచి తీరుతుందని ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఇదే విషయంపై భారత క్రికెట్ దిగజం సచిన్ టెండూల్కర్ కూడా స్పందించాడు.


 ఈ ఏడాది వరల్డ్ కప్ లో టీమిండియాను ఛాంపియన్గా చూడాలని ఉంది అంటూ మనసులో ఉన్న కోరికను బయట  పెట్టాడు. ఇక నా అభిప్రాయం ప్రకారం ఇండియా తో పాటు పాకిస్తాన్,ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు టాప్ ఫోర్ లో ఉంటాయి. అదే సమయం లో న్యూజిలాండ్ ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఏ క్షణంలోనైనా కివీస్ పుంజుకునే అవకాశం ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా ని కూడా తీసి పారేయడానికి వీల్లేదు. అయితే ఈ ఏడాది వరల్డ్ కప్ లో మాత్రం భారత జట్టు వరల్డ్ కప్ గెలవాలని బలంగా కోరుకుంటున్న అంటూ సచిన్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: