ప్రపంచంలోనే మేటిజట్టుగా కొనసాగుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే టి20 ఫార్మాట్లో అయితే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఇక టీమిండియా జట్టు టి20 లో మరింత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. అయితే ఇలా టి20లో మేటి జట్టుగా కొనసాగుతున్న టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచి మాత్రం 15 ఏళ్లు కావస్తోంది. కెప్టెన్లు మారినా టీమిండియాకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.


 ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు కొత్త కెప్టెన్ రోహిత్ అయినా టీమిండియా కు వరల్డ్ కప్ అందిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు టీమిండియా అభిమానులు. ఈ క్రమంలోనే టీమిండియా ఆడబోయే మొదటి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై ప్రాక్టీస్ మ్యాచ్లో మునిగి తేలుతున్న టీమ్ ఇండియా అటు ఈనెల 23వ తేదీన చిరకాల ప్రత్యేకమైన పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో రివ్యూలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.


 ఇక వరల్డ్ కప్ లో కప్పు గెలవడంపై ఇటీవలే కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ప్రపంచకప్ గెలిచి చాలాకాలం అయ్యింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ట్రోఫీ గెలవాలంటే తాము చేయాల్సింది చాలానే ఉంది. మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు ప్రశాంతంగా ఉంటే.. సంయమనం  ప్రదర్శిస్తే ఇక కోరుకున్న ఫలితాలు వస్తాయి. ఇక ఏడాది వరల్డ్ కప్ లో కప్పు గెలవాలన్నదే మా లక్ష్యం. అందుకోసం ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాం. ప్రతి అడుగు విజయవంతంగా వేసుకుంటూ వెళ్ళాలి మేము తర్వాత ఆడబోయే జట్టుపై మాత్రమే దృష్టి పెడతాం. సెమీఫైనల్స్, ఫైనల్స్ గురించి ముందే అతిగా ఆలోచించం అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ గా నాకు ఇదే మొదటి ప్రపంచ కప్ కావడంతో మరింత ఉత్తేజంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: