అయితే వరల్డ్ కప్ లో మిగతా జట్లు కూడా మ్యాచ్లు ఆడుతూ ఉన్నప్పటికీ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నది ఎక్కువగా చర్చించుకుంటుంది మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ గురించి అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులే కాదు మాజీ ఆటగాళ్లు సైతం స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా చెబుతూ ఉన్నారు. ఇరుజట్ల బలాబలాలపై ఇక తమ రివ్యూ చెప్పేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాజీ ఆటగాళ్లు చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం రోజు టీమిండియా భారత్ మధ్య పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ ఫేసర్ షాహీన్ ఆఫ్రిది జట్టులోకి తిరిగి రావడం ఇక పాకిస్తాన్ జట్టుకు ఎంతో ఉపశమనం కలిగించే విషయం అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఎంతో విరామం తర్వాత అతన్ని జట్టులోకి రావడం పాకిస్తాన్ చేతిలో ఉత్సాహాన్ని నింపుతుంది. గ్రౌండ్ ఫీల్డింగ్ లోపాలను కూడా పాకిస్తాన్ సరి చేసుకుంటుంది. భారత్తో జరగబోయే మ్యాచ్లో పాకిస్థాన్ విజృంభిస్తుంది అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.