సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడు ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. అదే క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే పదం తరచూ వినపడుతూనే ఉంటుంది. ఇక ఒక మ్యాచ్ జరిగినప్పుడు ఒక్క క్యాచ్ కూడా మిస్ చేయకుండా ఆటగాళ్లు ఒడిసి పట్టినప్పుడు తప్పకుండా ఆ జట్టు విజయం సాధిస్తుందని విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇలా క్రికెట్ పెద్దలు చెప్పింది ముమ్మాటికి నిజం అన్నది ప్రతి మ్యాచ్ లో కూడా నిరూపితం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎన్నో మ్యాచ్లలో క్యాచ్ లను మిస్ చేసిన జట్లు ఓడిపోవడం ఇక ఒడిసి పట్టిన జట్లు విజయం సాధించడం జరిగింది.


 ఇక ఇటీవలే వరల్డ్ కప్ లో మరోసారి ఇదే నిజం అని మరోసారి నిరూపితం అయింది. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ ఆఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే  ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ ప్లేయర్లు జోష్ బట్లర్, లియాన్ లివింగ్ స్టోన్ అద్భుతమైన క్యాచ్లతో ఆకట్టుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ హజ్రతుల్లా బజాయ్ కొట్టిన భారీ షాట్ ను బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద అద్భుతమైన డైవింగ్ చేసి క్యాచ్ పట్టుకున్నాడు లివింగ్ స్టోన్.

 పరిగెడుతూ సూపర్ మ్యాన్ లా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత జోష్ బట్లర్ పట్టిన క్యాచ్ అయితే మ్యాచ్ మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. మార్క్ వుడ్ బౌలింగ్లు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ నబి లెగ్ గ్లాన్స్ లో షాట్ ఆడాలని ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ బట్లర్ ను  క్రాస్ చేయబోయింది. ఇంతలో బట్లర్ పక్షి లాగా గాల్లోకి ఎగిరాడు. కళ్ళు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఇక ఈ రెండు క్యాచ్లు చూసిన తర్వాత క్యాచెస్ విన్ మ్యాచెస్ అని క్రికెట్ పెద్దలు ఊరికే అనలేదు అంటూ ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: