ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్ధుల  వెన్నులో వణుకు పుట్టించిన జట్టుగా కొనసాగింది వెస్టిండీస్ జట్టు. పవర్ఫుల్ హిట్టార్లకు మారుపేరుగా కొనసాగింది. ఇక వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడు అంటే చాలు సిక్సార్లు ఫోర్ లతో సృష్టించే విధ్వంసం క్రికెట్ ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక ఒకప్పుడు వెస్టిండీస్ తో మ్యాచ్ అంటే చాలు ఆ జట్టును ఓడించేందుకు ప్రత్యేకమైన వ్యూహాలను సిద్ధం చేసుకునేవి ప్రత్యర్థి జట్లు. అంతలా గొప్ప ప్రస్థానాన్ని కొనసాగించిన వెస్టిండీస్ జట్టు ఇక ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది.


 అంతర్జాతీయ క్రికెట్ లో మేటి జట్టుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా, భారత్లకు సైతం సాధ్యం కాని విధంగా టి20 వరల్డ్ కప్ లో రెండుసార్లు టైటిల్ గెలిచి విశ్వ విజేతగా నిలిచింది వెస్టిండీస్ జట్టు. అలాంటి జట్టు ఇక ఇటీవలే కనీసం వరల్డ్ కప్ లో అడుగుపెట్టకుండానే వెనదిరిగింది అన్న విషయం తెలిసిందే. క్రికెట్లో గట్టు పరిస్థితుల కారణంగా ఛాంపియన్ జట్టు కూడా క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే క్వాలిఫైడ్ మ్యాచ్లో సత్తా చాటి అటు వెస్టిండీస్ తప్పక సూపర్ 12 మ్యాచ్లు ఆడుతుంది అని అందరూ అనుకున్నారు.


 కానీ పసి కూన జట్ల చేతిలో ఓటమి చవిచూసిన వెస్టిండీస్ జట్టు చివరికి క్వాలిఫైయర్ దశలోనే ఇంటి బాట పట్టింది. కనీసం సూపర్ 12 లో కూడా అడుగుపెట్టలేకపోయింది అని చెప్పాలి. దీంతో వెస్టిండీస్ పై అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఆ జట్టు హెడ్ కోచ్ ఫీల్ సిమన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ కప్ లో వెస్టిండీస్ ఓటమికి బాధ్యత వహిస్తూ తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఆస్ట్రేలియా తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ముగియగానే టీం నుంచి తప్పుకోబోతున్నాను అంటూ ప్రకటించాడు. ఈ ఓటమి కేవలం జట్టు ఆటగాళ్ళను మాత్రమే కాదు దేశాన్ని మొత్తం బాధపెడుతుందని నేను అంగీకరిస్తున్నాను అంటూ ఒక ప్రకటనలో తెలిపాడు వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ .

మరింత సమాచారం తెలుసుకోండి: