
అయితే బాగా రానిస్తాడు అనుకున్న కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇద్దరు కూడా గత ఏడాది టీ20 వరల్డ్ కప్ మాదిరిగానే తక్కువ పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకొని జట్టును కష్టాల్లోకి పెట్టారు. ఒత్తిడిని అధిగమించలేకపోయిన కేఎల్ రాహుల్ నసీం షా బౌలింగ్లో బంతిని వికెట్ల మీదకు ఆడుకుని వినతిగాడు. ఇక రోహిత్ శర్మ హరీష్ రావుఫ్ బౌలింగ్ లో ఫస్ట్ స్లిప్పులో ఇఫ్తికార్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా వికెట్లు కోల్పోయారు.. ఇలాంటి సమయంలోనే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ కాస్త నిలదొక్కుని ఇక జట్టును విజయం వైపు నడిపించారు..
అయితే టీమిండియా ఓపెనర్ల వైఫల్యంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత ఓపెనింగ్ జోడి ఎంతగానో ఒత్తిడిలో కనిపించిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ బౌలర్లను చూసి కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ భయపడినట్లు కనిపించారని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంతో ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక కేఎల్ రాహుల్ కూడా అతిగా ఫోకస్ చేస్తున్నాడు. అప్రోచ్ కూడా సరిగ్గా లేదు.. ఇక వాళ్లు భయపడుతూ ఉండడంతో బౌలర్లు సులువుగా బుట్టలో వేసుకుంటున్నారు అంటూ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై భారత ఫ్యాన్స్ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.