ఈనెల 23వ తేదీన క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూసిన దాయాదుల పోరు జరిగింది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే ఏదైతే ప్రేక్షకులు కావాలి అనుకుంటారో.. అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ అందించింది ఈ మ్యాచ్. ఏకంగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో చివరి వరకు విజేత ఎవరు అర్థం కాని విధంగా మారిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో కఠిన పరిస్థితుల్లో వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ భారత జట్టుకు విజయాన్ని అందించాడు.


 తద్వారా టీమిండియా ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై చిరస్మరణీయమైన విజయాన్ని సాధించి వరల్డ్ కప్ లో భాగంగా బోనీ కొట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ అటు విరాట్ కోహ్లీ విరోచితమైన ఇన్నింగ్స్ పై మాత్రం ప్రశంసలు ఇంకా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రస్తుత క్రికెటర్లు కూడా స్పందిస్తూ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి గొప్పగా చెబుతూ అతని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు  ఇక క్లిష్ట పరిస్థితుల మధ్య అలాంటి సూపర్ ఇన్నింగ్స్ కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే సాధ్యమవుతుంది అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ పై రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ స్పందించారు.


 ఇప్పటివరకు నా జీవితంలో నేను చూసిన టి20 ఇన్నింగ్స్ లలో ఇటీవలే పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ చిన్ననాటి కోచ్. ఇక రోహిత్ ఫామ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ పవర్ ప్లే లో కాస్త టైం తీసుకుని సహజంగా ఆడితే బాగుంటుంది. అతడు కాస్త అగ్ర సివ్ గా కనిపిస్తున్నాడు. హై రిస్క్ గేమ్ ఆడుతున్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఇక రానున్న మ్యాచ్లో పుంజుకుంటాడు అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు రోహిత్ చిన్ననాటి కోచ్.

మరింత సమాచారం తెలుసుకోండి: