సాధారణం గా క్రికెటర్లకు సోషల్ మీడియా లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. సినీ సెలబ్రిటీల తో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగానే పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్లుగా కొనసాగుతున్న క్రికెటర్లను ఎప్పుడు మ్యాచ్ ఆడినా కూడా ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసుకొని వీక్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమం  లోనే ఏమాత్రం పొరపాట్లు చేసినా కూడా ఆ పొరపాటు గురించి సోషల్ మీడియా వేదికగా అటు క్రికెట్ అభిమానులు అందరూ కూడా చర్చించుకుంటూ ఉంటారు.

 ఒకవేళ ఎవరైనా ఆటగాడు పేలవ   ప్రదర్శన చేసి నిరాశపరిచాడు అంటే చాలు అతని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఒక ఆటాడుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ప్రస్తుతం కేఎల్ రాహుల్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ప్రాక్టీస్ మ్యాచ్లో అదరగొడుతున్న కేఎల్ రాహుల్ అటు అధికారిక మ్యాచ్లో మాత్రం భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ తక్కువ పరుగులకే వికెట్ కోల్పోతున్నాడు అని చెప్పాలి.ఈ క్రమంలోనే మొన్నటికిమొన్న పాకిస్తాన్ మ్యాచ్లో కీలకమైన సమయంలో వికెట్ చేజార్చుకొని జట్టును కష్టాల్లోకి నెట్టాడు.



 సరే పాకిస్తాన్ బౌలింగ్ బాగుంటుంది కాబట్టి రాహుల్ పొరపాటున వికెట్ కోల్పోయాడు. నెదర్లాండ్స్ తో మ్యాచ్లో మాత్రం బాగా రానిస్తాడని అభిమానులు అనుకున్నారు. కానీ నెదర్లాండ్స్ తో మ్యాచ్లో కూడా 12 బంతుల్లో 9 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. మరోసారి కేఎల్ రాహుల్ నిరాశపరచడంపై అటు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ ను టార్గెట్ చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా ట్రోల్స్ చేస్తూ ఎన్నో పోస్టులు పెడుతున్నారు అని చెప్పాలి. ఇక ఇలా ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయిన పోస్టులు చూస్తే ఎంతోమంది నేటిజన్లు నవ్వుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: