ఇకపోతే ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భాగంగా తన ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అనే విషయంపై సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ప్రపంచ కప్ టోర్నీ ఆరంభానికి ముందే తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మొదలుపెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు. నేను సోషల్ మీడియాను పక్కన పెట్టేసాను. అందుకే అందులో ఏం రాశారు అన్న విషయం కూడా నాకు తెలియదు. మీ అందరికీ కూడా సామాజిక మాధ్యమం ద్వారానే ఏం జరుగుతుంది.. ఏం రాశారు అన్న విషయం తెలుసు.
అయితే జీవితంలో ఎత్తు పల్లాలను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. సక్సెస్ సాధించడానికి కేవలం అవసరమైన అంశాల మీద మాత్రమే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్ అనేది బౌలర్లకు ఎంతో క్లిష్టంగా ఉంటుంది. అభిమానులు, కామెంటేటర్లు మాజీలు ఇలా ఎంతోమంది డెత్ ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయాలి అనే విషయంపై చాలా మాటలు చెబుతారు. కానీ బౌలర్లుగా జట్టుగా మాకు అందులో ఉండే కష్టాలు ఏంటో తెలుసు. కొన్నిసార్లు బౌలర్లకు ఎంత కష్టం ఉంటుందో.. బౌలింగ్ ట్రాక్ అయితే బ్యాట్స్మెన్ లకు అంతే కష్టంగా ఉంటుంది అంటూ భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు.