ఐపీఎల్ కారణంగా ఎంతో మంది ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ సంపాదించుకొని ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో కూడా అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఆటకాలలో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ కూడా ఒకరు. ఏకంగా తన బ్యాటింగ్లో విశ్వరూపం చూపిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మ్యాచ్ చివరి వరకు ఉన్నాడు అంటే ఇక అతను బ్యాటింగ్ తో చేసే వీరావిహారం ఊహకందని విధంగానే ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా భారత్ తో మ్యాచ్ జరిగిందంటే చాలు డేవిడ్ మిల్లర్ కిల్లర్ గా మారిపోతున్నాడు. ఏకంగా భారత బౌలర్లతో చెడుగుడు ఆడేస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 మిగతా జట్లతో మ్యాచ్ జరిగినప్పుడు అయినా సరే కాస్త బౌలర్లపై కరుణ చూపిస్తున్నాడేమో కానీ అటు టీమిండియాతో మ్యాచ్ జరిగినప్పుడు మాత్రం భారత బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు అని చెప్పాలి. బంతి ఎక్కడ వేసిన బౌండరీకి తరలిస్తూ భారీగా పరుగులు చేస్తూ ఉన్నాడు. ఇలా గత కొన్ని ఇన్నింగ్స్ లో డేవిడ్ మిల్లర్ ఏకంగా ఇండియా పై సాధించిన పరుగులు చూస్తే మాత్రం అతను టీమ్ ఇండియా బౌలర్లకు మిల్లర్ కాదు కిల్లర్గా మారిపోయాడు అని అటు ఎంతోమంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు అని చెప్పాలి.


 అతను మ్యాచ్ చివరి వరకు ఉన్నాడు అంటే ఇక సౌత్ ఆఫ్రికా విజయం సాధించడం పక్క అనే విధంగానే ప్రత్యర్థులను వనికిస్తున్నాడు. కాగా ఇప్పటివరకు ఇండియా పై 15 టి20 ఇన్నింగ్స్ లలో 379 పరుగులు చేశాడు డేవిడ్ మిల్లర్. ఇక అతను ఇన్నింగ్స్లలో యావరేజ్ 47.37 ఉండగా.. స్ట్రైక్ రేట్ 161.96 ఉంది.. అంటే అతని ఎంతలా విజృంభిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా పై రెండు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ ఉండడం గమనార్హం. ఇలా డేవిడ్ మిల్లర్ ఏకంగా భారత బౌలర్ల పై పగబట్టినట్లుగానే చెలరేగిపోతున్నాడు అని చెప్పాలి. ఇటీవలే జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించడంలో డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: