ఇటీవల కాలంలో ఎంతోమంది ఆటగాళ్లు అటు వరల్డ్ కప్ లో భాగంగా ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నారు అని చెప్పాలి. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇక రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక మ్యాచ్ జరిగిన ప్రతిసారి కూడా ఆటగాళ్లు సాధించిన రికార్డులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఐర్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఆటగాడు సాధించిన రికార్డు కూడా అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. రికార్డు అనగానే ఏదో గొప్ప రికార్డు అనుకోకండి.. ఏకంగా చెత్త రికార్డుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఐర్లాండ్ బౌలర్.



 ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే అప్పటికే ఇంగ్లాండ్ పై గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఐర్లాండ్ను ఆస్ట్రేలియా ఓడిస్తుందో లేదో అని అనుకున్నారు అందరూ. అయితే ఆస్ట్రేలియా సెమీఫైనల్ లో అడుగు పెట్టాలంటే కీలకమైన మ్యాచ్ కావడంతో అద్భుతంగా పోరాడి భారీ తేడాతోనే విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 179 పరుగులు చేసింది  ఆ తర్వాత ఐలాండ్ బ్యాటింగ్ చేయగ 25 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.  ఇక ఆ తర్వాత జట్టులో  టక్కర్ 71 పరుగులతో రాణించినప్పటికీ మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం అందలేదు. దీంతో 137 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తద్వారా 42 పరుగులు తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.


 ఇదిలా ఉంటే ఒక ఐర్లాండ్ బౌలర్ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐర్లాండ్  బౌలర్ మార్క్ ఆడయిర్ చెత్త బౌలింగ్ ప్రదర్శన మ్యాచ్ కూ హైలెట్గా నిలిచింది.  ఇన్నింగ్స్ 15 ఓవర్ వేశాడు మార్క్ ఆడయిర్. ఏకంగా 11 బంతులు సంధించాడు. 26 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ఐదు వైట్ బాల్స్ ఉండడం గమనార్హం. అయితే 15 ఓవర్ లో రెండో బంతిని లాంగ్ ఆన్  లో మెక్ కార్తి అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో సిక్స్ వెళ్లే బంతిని ఆపి కేవలం రెండు పరుగులకు మాత్రమే పరిమితం చేశాడు. లేదంటే ఇక మార్క్ ఆడయిర్ ఖాతాలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డు కూడా చేరిపోయేది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: