అక్టోబర్ 16వ తేదీ నుంచి కూడా క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూసిన టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే  ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా క్వాలిఫైయర్ మ్యాచ్లు కూడా ఏకంగా హోరాహోరీగా జరుగుతూ క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందించాయి. ఇక ఇప్పుడు సూపర్ 12 మ్యాచ్ లు నువ్వా నేనా అన్నట్లుగానే సాగుతూ ఉన్నాయి. పసికూన జట్లు దిగ్గజ జట్లు అనే తేడా లేదు. ఇక అన్ని టీంలు కూడా కప్పు గెలవడం లక్ష్యంగా దీటైన పోటీ ఇస్తూ ఉండడం గమనార్హం. దీంతో ఇక ప్రతి మ్యాచ్లో కూడా ప్రేక్షకుల అంచనాలు తారుమారవుతున్నాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అటు వర్షం కారణంగా కొన్ని మ్యాచ్లు రద్దు కావడంతో ఇక కొన్ని జట్ల పరిస్థితి అయితే కష్టాల్లో మునిగిపోయింది అని చెప్పాలి. సెమీ ఫైనల్లో అర్హత సాధించాల్సి ఉన్నప్పటికీ ఇక వర్షం కారణంగా మ్యాచ్ లు రద్దు కావడంతో ఇక పాయింట్లు కోల్పోయి చివరికి వరల్డ్ కప్ లో కేవలం సూపర్ 12 తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాయింట్ల పట్టికలో తక్కువ పాయింట్లు సాధించిన కారణంగా చివరికి సెమిస్ చేరకుండానే ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో భాగంగా సెమీ ఫైనల్ రేటు ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది.


 అయితే గ్రూప్ వన్ లో భాగంగా 6 టీం లో ఉండగా ఇటీవల శ్రీలంక చేతిలో ఓడిపోయిన ఆఫ్గనిస్తాన్ జట్టు సెమీఫైనల్ రేస్ నుంచి అధికారికంగా వైదొలిగింది అని చెప్పాలి. నాలుగు మ్యాచ్ లలో ఆ జట్టుకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే వచ్చాయి. ఆ జట్టు ప్రదర్శన మాత్రమే కాదు ఇక దురదృష్టం కూడా వెంటాడింది. రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి అని చెప్పాలి. ఇక తద్వారా ఒక మ్యాచ్లో గెలవడంతో కేవలం రెండు పాయింట్లతో సరిపెట్టుకున్న ఆఫ్గనిస్తాన్ తద్వారా సెమీఫైనల్ రేస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc