సాధారణంగా విలువిద్య గురించి దాదాపు అందరికీ అవగాహన ఉంటుంది. ఇప్పటివరకు అటు వివిధ పోటీలు చూడడమే కాదు సినిమాల్లో కూడా వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూపిస్తూ ఉంటారు. ఇకపోతే విలువిద్య  పోటీల్లో గుండ్రటి బోర్డుపై ఉండే బుల్స్ ఐ ఆటగాళ్లు ఎవరైనా గురి చూసి కొడితే ఆహా ఓహో అద్భుతం అని అందరూ ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే విలువిద్య పోటీల్లో ఇలా బుల్స్ ఐ అత్యుత్తమమైన టార్గెట్ అని అంటూ ఉంటారు. కానీ చాలామంది ఇక విలివిద్య పోటీలు  జరుగుతున్న సమయంలో ఇక ఇలాంటి రికార్డును సాధించడంలో విఫలం అవుతూ ఉంటారు. సరిగ్గా బుల్స్ ఐ మీదికి గురి చూసి బాణం విసరడంలో సక్సెస్ కాలేకపోతు ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇలా బుల్స్ ఐ మీదికి బాణం విసిరితేనే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా బాణాలను విసిరిన తీరు గురించి తెలిస్తే మాత్రం ఫిదా అవ్వకుండా ఉండలేరు అని చెప్పాలి. ఏకంగా ఒక చిన్న బెజ్జంలో నుంచి బాణాలను సందించగల టాలెంట్ను బయటపెట్టి ప్రస్తుతం అరుదైన రికార్డ్ను సృష్టించాడు. ఇక అందరూ ఉపయోగించే సాంప్రదాయ ఓట్టో మాన్ విల్లును ఉపయోగించి 30 అడుగుల దూరంలో ఉండి అది కూడా కేవలం ఒక సెంటీమీటర్ సైజు ఉన్న తాళం చెవి హోల్ లో నుంచి అలవోకగా ఏడు బాణాలను వెంటవెంటనే సందించాడు.


 అయితే ఇలా తాళం చెవి సందులో నుంచి దూరగలిగేందుకు వీలుగా ఈకలు లేని కార్బన్ బాణాలను ఉపయోగించాడు సదరు వ్యక్తి. ఇలా కీ హోల్ లో నుంచి వరుసగా అత్యధిక బాణాలను సంధించిన వ్యక్తిగా సరికొత్త గిన్నిస్ రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. కాగా అండర్ సేన్ ప్రతిభను చూసిన నేటిజన్లు నోరేళ్ల పెడుతున్నారు.. ఇది ఎలా సాధ్యమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విలువిద్యకు పూర్వ వైభవం తెచ్చే ఉద్దేశంతోనే తాను ఈ తరహా ప్రయోగాలు చేస్తూ ఉన్నాను అంటూ సదరు వ్యక్తి చెప్పుకొస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: