
తన 360 డిగ్రీస్ బ్యాటింగ్ తో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆదుకుంటున్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో కూడా మొదటిసారి ఆస్ట్రేలియాలోని బౌన్సీ పీచ్ లపై ఆడుతున్నప్పటికీ తన అద్భుతమైన షాట్లతో మరోసారి పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ తర్వాత భారత జట్టు తరఫున అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా కూడా సూర్య కుమార్ యాదవ్ కొనసాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే అతనిపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఇటీవలే భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆకాశానికి ఎత్తేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్ కొత్త మిస్టర్ 360 అంటూ కితాభిచ్చాడు సునీల్ గవాస్కర్. అతను జట్టులో లేకపోయినా అతడు విఫలమైన కూడా టీమిండియా 140, 150 పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతోంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో సూర్య కుమార్ యాదవ్ ఆడిన ప్రతి ఇన్నింగ్స్ కూడా 360 డిగ్రీస్ కోణంలో సాగిందని ప్రశంసించాడు సునీల్ గవాస్కర్. కాగా ఇటీవల జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 25 బంతుల్లో 61 పరుగులు చేసి అదరగొట్టాడు సూర్యకుమార్.