
ఇక ఎప్పటి లాగానే అద్భుతమైన ప్రదర్శన చేసి ఇక గ్రూప్ వన్ నుంచి టాప్ ప్లేస్ లో నిలిచిన న్యూజిలాండ్ జట్టు సెమి ఫైనల్ అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ కప్పు గెలవడం ఖాయమని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. కెప్టెన్సీ విషయంలో హీరోగా నిరూపించుకున్న కేన్ విలియంసన్ కప్పు గెలవడంలో మాత్రం జీరో గానే మిగిలిపోతున్నాడు అన్నది తెలుస్తుంది.
కెన్ విలియంసన్ సారథ్యంలో 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్ లో రెండుసార్లు ఫైనల్ కు చేరింది కివీస్ జట్టు. కానీ దురదృష్టవశాత్తు ట్రోఫీ మాత్రం అందుకోలేకపోయింది. కానీ తొలిసారి ఐసీసీ ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్షిప్ ను మాత్రం కైవసం చేసుకుంది అని చెప్పాలి. కానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రం ఒక్కసారి కూడా కప్పు కొట్టలేకపోయింది. ఇక 2022 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ మరోసారి టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగింది. ఇక నేడు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది కివీస్ జట్టు.
అయితే కేన్ విలియమ్సన్ సారథ్యంలో ఇక కివీస్ ఆడుతున్న మూడో పరిమిత ఓవర్ల ప్రపంచ కప్ కావడం గమనార్హం. ఒకవేళ పాకిస్తాన్ పై న్యూజిలాండ్ గెలిచి ఫైనల్ లో అడుగు పెడితే కేను మామ సారధ్యంలో న్యూజిలాండ్ కప్పు గెలవగలదా లేకపోతే మునుపటి బ్యాట్ సెంటిమెంట్ ను కొనసాగిస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.