సూపర్ 12 మ్యాచ్లలో ఎన్నో అంతరాయాలను ఎదుర్కొని సెమి ఫైనల్లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు చివరికి సెమి ఫైనల్లో పటిష్టమైన భారత్ను ఓడించి ఫైనల్ అడుగుపెట్టింది. ఫైనల్లో కఠిన పరిస్థితుల మధ్య ఒత్తిడిని జయించి చివరికి పాకిస్తాన్ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. అయితే అటు ఇంగ్లాండ్ జట్టు టైటిల్ విజేతగా నిలిచినప్పటికీ ఒక అరుదైన రికార్డు మాత్రం భారత మాజీ కెప్టెన్, కీలకమైన బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ పేరిటే లికించచబడింది అని చెప్పాలి. అదే వరల్డ్ కప్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు.
టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఏకంగా ఆరు మ్యాచ్ లలో 296 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. కఠిన సమయాలలో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. దీంతో కోహ్లీనే ఈ ఏడాది వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కొనసాగుతున్నాడు. అదే సమయంలో గత ఏడాది వరల్డ్ కప్ లో కూడా అత్యధిక పరుగులు ఆటగాడిగా ఘనత సాధించింది కూడా కోహ్లీనే కావడం గమనార్హం. ఇక విరాట్ కోహ్లీ 296 పరుగుల తర్వాత నెదర్లాండ్స్ బ్యాట్స్మెన్ ఓడౌడ్ ఎనిమిది మ్యాచ్లో 242 పరుగులు, సూర్యకుమార్ ఆరు మ్యాచ్ లలో 239 పరుగులు, ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ 225 పరుగులతో వరుసగా నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.