జోగిందర్ శర్మ తన బౌలింగ్ తో మ్యాజిక్ చేయడంతో చివరి ఓవర్ లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య 2007 వరల్డ్ కప్ లో భారత జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోని ఇక ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షోయబ్ మాలిక్ ఫైనల్ లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా చివరి ఓవర్ వేసేందుకు భారత స్టార్ బౌలర్లు ఎవరు ముందుకు రాలేదు. అయితే వారి పేర్లను ప్రస్తావించడం సరైనది కాదు. ఇక ధోని అందరిని అడిగి మరి చివరికి జోగేందర్ శర్మ చేతికి బంతిని ఇచ్చాడు. మిస్బా బ్యాటింగ్ దూకుడు ముందు టాప్ బౌలర్లు సైతం భయపడ్డారు. అతను మైదానం నలువైపులా షాట్లు కొట్టాడు.
అయితే ఇప్పుడు అందరూ స్కూప్ షాట్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ చివరి వికెట్ పడకుండా ఉంటే తప్పనిసరిగా అలాంటి షాట్ కూ మిస్బా వెళ్లేవాడు కాదని గట్టిగా చెబుతా.. ఎందుకంటే అప్పటికే జోగిందర్ బౌలింగ్ లో మిస్బా ఏకంగా భారీ సిక్స్ కొట్టాడు అంటూ షోయబ్ మాలిక్ వివరించాడు. అయితే చివరి ఓవర్ వేసేటప్పటికి అప్పటికే జట్టులో టాప్ పేసర్లుగా ఉన్న ఆర్పి సింగ్, శ్రీశాంత్ ఇర్ఫాన్ పఠాన్ ఓవర్లకోట ముగిసింది. జోగేందర్ శర్మకు ఒకటి, యూసఫ్ పఠాన్ కూ మూడు, హార్భజన్ సింగ్ ఒక ఓవర్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని జోగేందర్ శర్మ చేతికి బంతిని అప్పగించాడు.